ప్రభాస్ 'ఆదిపురుష్' లో సీత పాత్ర చేసే నటీమణి కోసం ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండతో 'ఫైటర్' చిత్రంలో చేస్తున్న అనన్యపాండే పేరు వినబడుతోంది.   సోషల్ మీడియాలో 'ఆదిపురుష్'లో సీతగా అనన్యపాండే చేస్తుందనే వార్త విన్న నెటిజన్లు మాత్రం..అవాక్కవుతున్నారట. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే.. సీతగా ఆమె వద్దు బాబోయ్ అంటున్నారట. ఫైనల్గా ఈ పాత్రకు ఎవరు ఫిక్స్ అవుతారో తెలియదు కానీ..ప్రస్తుతం ఈ వార్త ప్రభాస్ అభిమానులకు షాక్ ని కలిగిస్తోంది.