ఓటీటీలో అగ్ర దర్శకులు షోస్ చేయబోతున్నట్లుగా చెబుతూ.. వారి పేర్లను కూడా రివీల్ చేశారు.ఈ వేదికపై అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ''నెంబర్ వన్ తెలుగు ఫ్లాట్‌ఫాంగా ఆహాని మార్చినందుకు చాలా ఆనందంగా ఉంది.అలాగే ఆహాకు ఏదైనా చేయాలనిపించింది. అప్పుడే అల వైకుంఠపురములో సినిమా పూర్తయ్యింది.  మీరు, త్రివిక్రమ్ కలిసి ఏదైనా చేయొచ్చు కదా.. అని అడిగినప్పుడు నేను, త్రివిక్రమ్‌గారు కలిసి ఓ యాడ్ చేశాం.అంతే కాకుండా నాతో కలిసి పనిచేసిన నలుగురు దర్శకులు ఆహాలో షోస్ చేస్తున్నారు. సుకుమార్‌గారు ఓ అద్భుతమైన షో చేయబోతున్నారు. అలాగే హరీశ్ శంకర్ కూడా ఆహా కోసం ఓ షో చేస్తున్నారు. సురేందర్ రెడ్డిగారు కూడా ఓ షో చేస్తున్నారు. వంశీ పైడిపల్లిగారు కూడా ఆహా కోసం ఓ షో చేస్తున్నారు. వీరుచేయబోయే షోస్ గురించి అప్డేట్స్ త్వరలో ఇస్తాం'' అని తెలిపారు.