తమ్ముడు అఖిల్ కోసం అన్న నాగచైతన్య ఓ త్యాగం చేశాడు. సక్సెస్ కోసం తపిస్తున్న అఖిల్ కెరీర్ కోసం చైతన్య కాస్త వెనక్కు తగ్గాడు. తమ్ముడి సినిమాకి కాంపిటీషన్ ఇవ్వకుండా వెనకడుగేశాడు. నాగచైతన్య చేసిన త్యాగం దీపావళి రోజు వెలుగులోకి వచ్చింది. లవ్ స్టోరీ సినిమాకి సంబంధించి దీపావళి సందర్భంగా కొత్త పోస్టర్ విడుదల చేసిన నాగచైతన్య.. అందులో రిలీజ్ డేట్ లేకుండా జాగ్రత్త పడ్డాడు. అంటే తమ్ముడి మోస్ట్ ఎలిజిబుల్ బ్యార్ లర్ కి తన లవ్ స్టోరీని అడ్డు లేకుండా చేశాడన్నమాట.