చిరంజీవికి కరోనా సోకడం అబద్ధమని తేలడంతో ఇప్పుడంతా సవ్యంగానే ఉంది. అయితే చిరంజీవికి కరోనా అనుకుని ఆచార్య షూటింగ్ విషయంలో దర్శకుడు కొరటాల శివ ఆయన లేకుండానే సీన్లు చిత్రీకరించడం మొదలు పెట్టారు. చిరు క్వారంటైన్ పీరియడ్ లో ఉంటారని భావించి దాదాపు రెండు వారాలపాటు హీరో హీరోయిన్లు లేని సీన్లు తీస్తున్నారు. తీరా ఇప్పుడు చిరు రావడంతో.. ఆ సీన్లను పక్కనపెట్టాలి. అందుకే చిరంజీవికి రెండు వారాలపాటు రెస్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. చిరు లేకుండా అనుకున్న సీన్లను చకచకా కంప్లీట్ చేసి ఆ తర్వాత చిరంజీవి నటించే సీన్లు తీస్తారట.