చిరంజీవి సినిమా రీఎంట్రీ తర్వాత ఆయనతో సినిమాలు చేస్తున్న దర్శకుల పరిస్థితి మరీ దారుణంగా తయారవుతోంది. ఖైదీ నెంబర్ 150 తీసిన వి.వి.వినాయక్ ఆ తర్వాత మరో సినిమా చేయడానికి ఏకంగా ఏడాదిపాటు వేచి చూడాల్సి వచ్చింది. పోనీ మెగా కాంపౌండ్ లోనే మరో సినమా అవకాశం దొరికిందని సంబర పడ్డా కూడా ఇంటెలిజెంట్ మూవీ అట్టర్ ఫ్లాప్ కావడంతో డీలా పడ్డారు వినాయక్. కట్ చేస్తే.. ఇప్పటి వరకు మరో సినిమా చేయలేకపోయారు. తీరా చిరంజీవితో లూసిఫర్ రీమేక్ అవకాశం వచ్చిందన్న సంతోషం కూడా ఎక్కువరోజులు నిలబడలేదు. ఆ రీమేక్ మూవీనుంచి కూడా వినాయక్ ని తప్పించారనే ప్రచారం జరుగుతోంది.