చిరు స్వయంగా తనకు కరోనా వచ్చిందని తెలిపాడు.కానీ అది తప్పుడు రిపోర్ట్ అని రెండు రోజుల తర్వాత తెలిసింది.కరోనా వచ్చిందని తెలియగానే మరో 15 రోజులు వాయిదా పడిందని అర్థమైపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ ప్లాన్స్ అన్నీ మార్చేసాడు కొరటాల శివ. షెడ్యూల్ అంతా సిద్ధం చేసాడు దర్శకుడు కొరటాల. జనవరి వరకు షూటింగ్ మొదలుపెట్టకూడదని ముందు అనుకున్నా కూడా ఇప్పుడు ఫిబ్రవరి లోపు ఆచార్యకు ముగింపు ఇవ్వాలని చూస్తున్నాడు చిరంజీవి.   పాపం ఇప్పటికే కొరటాల రెండేళ్లుగా ఇదే సినిమాపై ఉండటంతో ఇంకా వేచి చూపించకూడదని ఫిక్సయ్యాడు మెగాస్టార్.