దర్శకులకు షాక్ ఇస్తున్నాడు సూపర్ స్టార్. అయితే అది సీరియస్ షాకులు కాదు.. స్వీట్ షాకులు. దివాళీ సందర్భంగా తన దర్శకులందర్నీ గుర్తు పెట్టుకుని మరీ గిఫ్టులు పంపిస్తున్నాడు మహేష్ బాబు. ఈ క్రమంలోనే ఆయన గుణశేఖర్ కు కూడా గిఫ్ట్ పంపాడు.  అది తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసి మహేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపాడు.ఇప్పుడు మరో దర్శకుడికి కూడా ఇలాగే బహుమతి ఇచ్చాడు మహేష్ బాబు.ఆయనే పరశురామ్.. ప్రస్తుతం ఈయనతోనే సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు సూపర్ స్టార్. ఒక్కసారి మహేష్ బాబుతో సినిమా చేస్తే వాళ్లను అలాగే గుర్తు పెట్టుకుంటాడు మహేష్. హిట్ ఇచ్చినా ఫ్లాపిచ్చినా కూడా తన కుటుంబ సభ్యుల్లాగే చూస్తుంటాడు. ఇప్పుడు పరశురామ్ ను కూడా తన కుటుంబంలోకి చేర్చుకున్నాడు సూపర్ స్టార్.