మల్దీవుల అందాలను తన ఫాలోవర్స్ కు చూపిస్తూ వావ్ అనిపిస్తున్న కాజల్ ఈసారి వర్కౌట్ చేస్తున్న ఫొటోను షేర్ చేసి అందరిని ఆశ్చర్యపర్చింది.ఇక అక్కడే కొన్ని రోజుల నుంచి ఎంజాయ్ చేస్తోంది ఈ జోడీ. అంతేకాదు, హనీమూన్ ఫొటోలను సోషల్ మీడియాలో రెగ్యులర్ గా షేర్ చేస్తూనే ఉంది. సముద్రపు ఒడ్డున భర్తతో సేద తీరుతున్న ఫొటోలను, అండర్ వాటర్ బెడ్రూమ్ ఫొటోలను ఇలా అనేక చోట్ల దిగిన పిక్స్‌ను అభిమానులతో పంచుకుంటోంది.ఇదిలా ఉంటే.. తాజాగా హనీమూన్ కోసం కాజల్ ఖర్చు చేసిన లెక్కలు బయటికి వచ్చాయి. ఈ అమ్మడు హనీమూన్ కోసం అక్షరాలా 40 లక్షలకు పైగానే ఖర్చు చేసిందట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం అంటున్నారు. మొత్తానికి కాజల్-గౌతమ్ జంట తమ హనీమూన్ కోసం గట్టిగా ఖర్చు పెట్టారనే తెలుస్తుంది.