ఇంద్ర గంటి మోహన కృష్ణ కి మంచి క్లాసిక్ చిత్రాల దర్శకుడిగా మంచి పేరు ఉంది. అతని కెరీర్ లో తీసిన సినిమాలన్ని హిట్టయ్యాయి. ఇక అతని టాలెంట్ చూసే సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ యాక్టర్స్ ఇంప్రెస్ అయ్యి సినిమా చెయ్యాలి అని ఆలోచనలో పడ్డారు. కాని ఇటీవల అతను తీసిన "వి" చిత్రం భారీ ప్లాప్ అవ్వడంతో తనపై స్టార్ యాక్టర్స్ కి వున్న ఇంప్రెషన్ మొత్తం పోగొట్టుకున్నాడు. ఇక చేసేది లేక తనకు కలిసోచ్చిన హీరో సుధీర్ బాబుతో సినిమాకి రెడీ అయ్యాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టి తానేంటో ప్రూవ్ చేసుకోడానికి రెడీ అవుతున్నాడు.