ఆచార్య సిినిమా చేతిలో ఉన్నా కూడా కాజల్ ధైర్యంగా పెళ్లి చేసుకుని హనీమూన్ కి వెళ్లిందంటే.. ఈ సినిమాని, అందులో పాత్రని కాజల్ ఎంతగా లైట్ తీసుకుందో అర్థమవుతోంది. ఆచార్య సినిమాలో హీరోయిన్ పాత్ర పెద్దగా లేదని, ఉన్నా.. అది కేవలం హీరో ఎలివేషన్ కి మాత్రమే పనికొస్తుందని అంటున్నారు. దీన్ని పూర్తిగా హీరో ఓరియంటెడ్ మూవీగా తీర్చిదిద్దుతున్న కొరటాల శివ, హీరోయిన్ పాత్రని పక్కనపెట్టేశారు. అందుకే త్రిష సినిమానుంచి బైటకి వచ్చేసిందని, ఇప్పుడు కాజల్ హీరోయిన్ గా ఉన్నా కూడా సినిమాని లైట్ తీసుకుందని అంటున్నారు.