దీపావళి సందర్భంగా అలవైకుంఠ పురములో సినిమాని రెండోసారి టీవీలో టెలికాస్ట్ చేశారు. పండగ రోజున వచ్చిన అలవైకుంమఠ పురములో సినిమాకు మరోసారి అనూహ్య స్పందన వచ్చిందని అంటున్నారు. ఈసారి కూడా మంచి రేటింగ్ వస్తుందని నమ్మకంగా చెబుతున్నారు ఛానెల్ నిర్వాహకులు. రెండో సారి టెలికాస్ట్ అయిన సినిమాలకు రేటింగ్ 10 రావడమే కష్టం అట. అలాంటిది 15 లేదా 16 వరకు రేటింగ్ నమోదు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అదే నిజమైతే మరో అరుదైన రికార్డ్ అల్లు అర్జున్ సొంతం అవుతుంది.