ఎన్టీఆర్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఈ రోజుతో ఏకంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అభిమానులు ఓ సీడీపీని విడుదల చేశారు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ సీడీపీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన పాత్రలన్నింటిని చూపించడంతో పాటు.. తాజాగా ఆయన చేస్తోన్న 'ఆర్ఆర్ఆర్'లోని ఆయన ఆయుధాన్ని హైలెట్ చేశారు. మరో వైపు ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ సీరియస్ లుక్‌ని చూపించారు. ఈ సీడీపీని సంగీత సంచలనం ఎస్.ఎస్. థమన్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. 20 సంవత్సరాల అద్భుతమైన జర్నీ అని తెలుపుతూ.. ఈ సీడీపీని విడుదల చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. రచయిత కోన వెంకట్ కూడా ఈ సీడీపీని పోస్ట్ చేసి.. ఎన్టీఆర్ జర్నీలో తను కూడా భాగమైనందుకు సంతోషంగా ఉన్నట్లుగా చెప్పారు.