తాజాగా కీర్తి సురేష్ ఉన్నట్లుండి కొత్త లుక్ లో కనిపించింది.దండుపాళ్యం సినిమాలోని నేరస్తుల వలె కూర్చున్న 'సాని కాయిదం' సినిమా పోస్టర్ ను షేర్ చేసింది కీర్తి సురేష్. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు యువన్ శంకర్ రాజా దర్శకత్వం అందిస్తున్నాడు. సెల్వ రాఘవన్ కూడా ఈ పోస్టర్ లో ఉండటంతో తమిళ ప్రేక్షకులతో పాటు అంతా కూడా వావ్ అంటున్నారు.  తలకు గాయాలతో కీర్తి సురేష్ డీ గ్లామర్ గా చీర కట్టులో కాళ్లపై కూర్చుని ముందు ఆయుధాలు ఉండటంతో ఇదేదో క్రైమ్ డ్రామా మూవీ అయ్యి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంది.సాని కాయిదం' సినిమాలో దండుపాళ్యం తరహా పాత్రలో కనిపించబోతుండటం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.