ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం దివాళి సెలబ్రేషన్లో పాల్గొన్నారు. రాత్రి దివాళి పండుగ సందర్భంగా చిరంజీవి, రామ్చరణ్ సెల్ఫీలతో రెచ్చిపోయారు. ఇద్దరు ఒక్క చోట చేరి తమతోపాటు వెనకాల కాంతులను బంధించేందుకు తపించారు. పటాసుల పేలగా వచ్చే మిరుమిట్లు, కాంతులను సెల్ఫీలో బంధించేందుకు ప్రయత్నించారు. తమ ఇంటి మేడపైకి ఎక్కి మరీ వీరిద్దరు సెల్ఫీల కోసం ప్రయత్నించారు.అటు మెగాస్టార్ చిరంజీవి, రామ్చరణ్ పంచుకున్నారు. చిరంజీవి `మా రాత్రి దివాళి రాత్రి` అని పోస్ట్ పెట్టగా, రామ్చరణ్ వెలుగులను బంధించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.