తలపతి విజయ్ కథానాయకుడిగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మాస్టర్'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.ఈ టీజర్ 24 గంటలు గడవకముందే ఏకంగా 16 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడంతో పాటు 1.7 మిలియన్ లైక్స్ సాధించి ఆల్టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవరాల్గా ఇప్పటివరకు 22 మిలియన్ వ్యూస్ దాటగా.. 1.9మిలియన్ లైకులతో ఎవరికీ అందని ఎత్తులో నిలిచింది ఈ టీజర్. విజయ్ స్టామినా ఏంటో మరో సారి రుజువు చేసింది...ఇప్పుడు దాకా 24 మిలియన్ వ్యూస్...2 మిలియన్ లైక్స్ రాబట్టి యు ట్యూబ్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా దూసుకుపోతుంది.