సాయిరామ్ శంకర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం వున్న హీరోనే . తన మొదటి సినిమా ‘143’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతగానో ఆకట్టుకున్నాడు.తరువాత ‘డేంజర్’ లాంటి మల్టీ స్టారర్ మూవీలో నటించి నటుడిగా ఆకట్టుకున్నాడు. ‘బంపరాఫర్’, ‘రోమియో’ వంటి చిత్రాల్లో సాయిరామ్ శంకర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే, మరికొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేశారు. సాదారణ నటుడిగా పేరోచ్చిన కానీ, కమర్షియల్ హీరోగా సరైన బ్రేక్ అయితే సాయిరామ్ శంకర్‌కు రాలేదు. అన్న పెద్ద డైరెక్టర్ అయినా కాని పెద్దగా సపోర్ట్ ఇవ్వటం లేదు. అయితే, మరోసారి తన అదృష్టాన్ని "రీ సౌండ్ " అనే మూవీతో పరీక్షించుకోవడానికి  వస్తున్నాడు సాయి.