కొడుకు అఖిల్ తో కలసి నాగార్జున ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి దీనికి దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. అయితే ఈ సినిమాలో నాగచైతన్యకు మాత్రం చోటులేదు. గతంలో మనం సినిమాలో నాగచైతన్య, నాగార్జున, నాగేశ్వరరావు కలసి నటించారు. చివర్లో అఖిల్ చిన్న గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారంతే. అయితే ఇప్పుడు కొత్త సినిమాలో అఖిల్, నాగార్జున ఇద్దరు మాత్రమే కనిపిస్తారట. చైతన్యకు ఇక్కడ గెస్ట్ అప్పియరెన్స్ కూడా లేదని తెలుస్తోంది.