పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ మూవీకి డైలాగ్స్ రాస్తున్నారట ఈయన. ఈ స్క్రిప్టుకు రచనా సహకారం, డైలాగ్స్ త్రివిక్రమ్ రాయబోతున్నట్లు సమాచారం. అయితే కేవలం రచనకు పదికోట్లు ఇవ్వటం అనేది తెలుగు పరిశ్రమలోనే కాదు ఇండియన్ పరిశ్రమలోనే చాలా చాలా అరుదైన విషయం.రైట్స్ తీసుకున్నప్పుడు ఈ సినిమాని సింపుల్ గా తెలుగులో చేద్దామని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఫిక్సయ్యారు.కానీ త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ సీన్ లోకి వచ్చాక మొత్తం మారిపోయింది. త్రివిక్రమ్ సినిమాని సమర్పిస్తూ, డైలాగులు రాస్తూండటంతో సినిమా స్పాన్ పెరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నారు.