మెగా ఫ్యామిలీ వారసురాలు మెగా బ్రదర్ నాగబాబు కూతురు, హీరోయిన్ నిహారిక పెళ్లి పనుల్లో బాగా బిజీ అయిపోయింది మెగా ఫ్యామిలీ. ముఖ్యంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన చెల్లెలు నిహారిక పెళ్లికి సంబంధించిన పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. మరోవైపు కాబోయే పెళ్లికూతురు నిహారిక సైతం తన పెళ్లి పనులను ప్రత్యక్షంగా దగ్గరుండి చూసుకుంటుందని సమాచారం. తాజాగా పెళ్లి పనులు కోసం ఈ మెగా డాటర్ ఉదయ్‌పూర్ వెళ్లిందని మెగా వర్గాలు పేర్కొంటున్నాయి.