.ప్రస్తుతం తారక్‌తో పొలిటికల్ టచ్ ఉండే సినిమాను తెరకెక్కించనున్నట్టు టాక్ 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. త్రివిక్రమ్ క్రియేట్ చేసిన పాత్రలకు కూడా సరిగ్గా సూటయ్యే నటులను ఎంపికచేస్తుంటారు. అత్తారింటికి దారేది సినిమాలో నదియా అల వైకుంఠపురములో టబును పెట్టి ఎంతో చక్కని డ్రామాను నడిపించారు.అత్తారింటికి దారేది చిత్రం నదియాకు మంచిపేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆ ఇమేజ్ తో ఆమె పలు సినిమాల్లో నటించింది. తారక్ తో చేయబోయే సినిమాలోనూ ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటి రమ్యకృష్ణను తీసుకొస్తున్నట్టు టాక్. బాహుబలి చిత్రంలో శివగామిగా నటించి రమ్యకృష్ణ ఎంతోపేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఆమె కొన్ని చిత్రాల్లో అత్త పాత్రల్లో నటించినప్పటికి.. పెద్దగా పేరు రాలేదు. అయితే తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ పాత్రలో రమ్యకృష్ణ నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.