‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. లాక్ డౌన్ లో ఓటీటీలో రిలీజైన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కానీ సూర్య సినిమా ఓటీటీలకు ఊరటనిచ్చింది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ నడుస్తుంది. మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవ్వడంతో ఈ సినిమా కచ్చితంగా చూడాలని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాతో అమెజాన్ కి సబ్ స్క్రెబర్లు కూడా పెరుగుతున్నారని తెలుస్తోంది. మరోపక్క డిసెంబర్ నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తిస్థాయిలో ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ మొదటివారంలో థియేటర్లు ఓపెన్ చేస్తే అప్పటికి రిలీజ్ చేయడానికి కొత్త సినిమాలేవీ ఉండవు కాబట్టి ఓటీటీలో రిలీజైన సినిమాలనే థియేటర్లలో ప్రదర్శించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ఓటిటిలో రిలీజ్ అయిన ‘వి’, ‘నిశ్శబ్దం’, ‘మిస్ ఇండియా’ వంటి సినిమాలను ప్రదర్శించాలని భావించిన ఎగ్జిబిటర్లు ఇప్పుడు సూర్య సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా తెలుగు హక్కుల కోసం చాలా మంది బయ్యార్లు పోటీ మీద పోటీ పడుతున్నారు.