‘ఇప్పుడున్న హీరోల్లో ఇతను చాలా అద్భుతంగా చేస్తున్నాడు అనిపించిన తెలుగు హీరో ఎవరు?’ అని అడిగిన ఆలీ ప్రశ్నకు అర్చన జవాబు ఇస్తూ .. ‘జనతా గ్యారేజ్ చూస్తున్నప్పుడు నాకు జూనియర్ ఎన్టీఆర్ గారి నటన చాలా నచ్చింది. అది చాలా కన్వెన్సింగ్ పెర్ఫార్మెన్స్. ఒక యాక్టర్ నచ్చారు అంటే ఎందుకు నచ్చారో కూడా కచ్చితంగా చెప్పాలి. అదే సినిమాలో మోహన్ లాల్ గారు ఉన్నారు. అందరికీ ఒక డ్రీమ్ హీరో ఆయన. చాలా ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ ఆయన.