ఛత్రపతి షూటింగ్ సమయంలో జరిగిన ఓ సరదా సంఘటన గురించి నటుడు మనోజ్ నందం తెలిపాడు. అసలు విషయం ఏంటంటే హైదరాబాద్ లోని ఓ బంగ్లాలో ఛత్రపతి షూటింగ్ జరుగుతుంది. అక్కడే యూనిట్ అంతా ఉంది. భారీ షెడ్యూల్ జరుగుతుంది. అలాంటి సమయంలో లొకేషన్ కు వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్.వచ్చిన వాడు ఊరికే ఉండకుండా రాజమౌళిని అక్కడ్నుంచి లాక్కెళ్లిపోయాడు. వద్దు వద్దు అని చెప్తున్నా కూడా వినలేదు.  దానికి కారణం కూడా లేకపోలేదు. దానికి ముందు రోజు ఓ సినిమా చూసాడు జూనియర్ ఎన్టీఆర్. అది ఆయనకు బాగా నచ్చి రాజమౌళితో కలిసి చూడాలనుకున్నాడు. అంతే వెంటనే ఛత్రపతి లొకేషన్‌కు వచ్చి అక్కడ్నుంచి జక్కన్నను తీసుకెళ్లిపోయాడు జూనియర్. షూటింగ్ ఉందిరా బాబూ నేను రానని మొత్తుకున్నా పట్టించుకోలేదు.. నన్ను కాదని షూటింగ్ ఎలా చేస్తావో చూస్తానంటూ లొకేషన్ మధ్యలో కూర్చుని అల్లరి చేసాడు. ప్యాకప్ చెప్పే వరకు వదల్లేదు.