వేదలమ్ రీమేక్ కి చిరు తీసుకునే పారితోషికంపై ఫిలిం ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చలు మొదలయ్యాయి.మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో తెరకెక్కబోయే వేదాళం రీమేక్ కి చిరు పారితోషకం ఫిక్స్ అయ్యింది అని..అది కూడా ఓ రేంజ్ పారితోషికం అనే ప్రచారం జరుగుతుంది.  ఆచార్య కోసం 50 కోట్లు అందుకుంటున్న చిరంజీవి.. వేదాళం రీమేక్ కి మరో పది కోట్లు ఎక్స్ట్రా అంటే.. 60 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడని..ఇప్పటికే అగ్రిమెంట్లు కూడా పూర్తయ్యాయంటూ ఓ న్యూస్ ఫిలింసర్కిల్స్ లో చర్చలకు తెర లేపింది. మరి చిరు పారితోషికం కేవలం ఒక సినిమాకు 60 కోట్లు అంటే.. నిజంగా ఇది అందర్నీ ఆశ్చర్య పరిచే విషయమనే చెప్పాలి.