కమర్షియల్ మూవీస్ పై తనకెప్పుడూ చిన్న చూపు లేదంటోంది హీరోయిన్ తమన్నా. వాణిజ్య ప్రధానమైన కథల్లో హీరోయిన్ల పాత్రల పరిధి చాలా తక్కువగా ఉంటుందని, ఆ పరిధిలోనే నటించాలి, ఆ పరిధిలోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలని చెబుతోంది. అది చాలా కష్టమైన వ్యవహారమే అయినా తనకు చాలా ఇష్టం అంటోంది తమన్నా.