ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 2021 సమ్మర్ నాటికి ఈ సినిమా విడుదలకు సిద్ధం చేయాలనేది దర్శక నిర్మాతల ప్రణాళిక. ప్రభాస్ చాలాకాలం క్రితమే రాధే శ్యామ్ ఐరోపా షెడ్యూల్ పూర్తి చేశాడు. ఇటీవల ఇటలీలో కూడా కొంత భాగం షూటింగ్ జరిగింది. ఇప్పుడు ప్రభాస్ ముంబైలో ఉంటున్నారని, ఓం రౌత్ తో చేస్తున్న సినిమా ఆది పురుష్ కోసం త్రీడీ టెస్ట్ లుక్ కూడా పూర్తయిందని అంటున్నారు. అంటే రాధే శ్యామ్ పని పూర్తయిన వెంటనే ప్రభాస్ ఆదిపురుష్ ని టేకప్ చేస్తారని కన్ఫామ్ చేస్తున్నారు.