సాయితేజ్ నటించిన చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'.నభా నటేష్ నాయికగా నటించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ని తొలుత మే 1న రిలీజ్ చేయాలనుకుంది చిత్ర బృందం. అయితే కరోనా కారణంగా వాయిదా వేసుకున్నారు. లాక్ డౌన్ ముగిశాక రీసెంట్ గా సినిమా షూటింగ్ సైతం ఫినిష్ చేసిన యూనిట్.. ఇప్పుడు థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాక బిగ్ స్క్రీన్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోందట. సరిగ్గా ఏడాది తరువాత మరో కొత్త సినిమాతో సాయి ధరమ్ సిద్ధం అయ్యాడు. తాజా సమాచారం ప్రకారం సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు. ఈ చిత్ర నిర్మాణ భాగస్వామిగా ఉన్న జీస్టూడియోస్ నేడు ఈ విషయాన్ని తెలియజేశారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.వచ్చే నెలలో థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో కోవిడ్ తరువాత థియేటర్స్ లో దిగే మొదటి హీరోగా సాయి ధరమ్ రికార్డులకు ఎక్కనున్నారు.