"సినిమా ఇండస్ట్రీలోకి తెలుగమ్మాయిగా వచ్చిన నాకు చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఫస్ట్.. తెలుగమ్మాయి అనగానే తీసిపాడేస్తారు. తెలుగమ్మాయి కాబట్టి కమిట్మెంట్ అడగడం ఈజీ అయిపోతుంది. హిందీ అమ్మాయిలను అయితే మేనేజర్ల సహాయంతో కాస్త కష్టపడాలి. తెలుగమ్మాయిని కాబట్టి నన్ను డైరెక్ట్‌గా అడిగేసేవారు. అలాంటి కమిట్మెంట్లు, అలాంటి వ్యక్తులను తప్పించుకుని వచ్చాను. చాలా పెద్ద పెద్ద దర్శకులతో పనిచేశాను, చాలా చోట్ల ఇబ్బందికరంగా ఫీలయ్యాను. అయితే, నా స్టోరీని జనాలకు చెప్పే అవకాశం రాలేదు. అందుకే దేవుడు ఈ సినిమాను నాకు ఇచ్చాడు. ఇది కచ్చితంగా నా లైఫ్ స్టోరీ.ఈ సినిమాని భూతు సినిమా లాగ కాకుండా మంచి సినిమాల చూడండి. ఈ స్థాయికి రావడానికి నేనెంత ఫైట్ చేశానో ఈ సినిమా చెబుతుంది’’ అని తేజస్వి చెప్పింది.