ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి, అభయ్ రామ్ ఎయిర్పోర్టులో కెమెరా కంటికి చిక్కారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఎన్టీఆర్ కాజువల్ లుక్లో చాలా సింపుల్గా ఉన్నారు. కుంకుమ రంగు రౌండ్ నెక్ టీ షర్ట్, జీన్స్లో యంగ్ టైగర్ లుక్ అదిరింది. నాన్న చేయిని పట్టుకుని నడుచుకుంటూ అభయ్ రామ్ వెళ్తుండగా వీరి వెనుకే లక్ష్మీ ప్రణతి వస్తున్నారు.కాగా ఈ ఫోటోల్లో ఎన్టీఆర్ మునుపెన్నడు లేని విధంగా అల్ట్రా స్టైలిష్ లుక్ లో కిర్రాక్ వున్నాడు. ఈ ఫొటోస్ కి ఫ్యాన్స్ తెగ ఫిదా అయిపోతున్నారు.