సోలో బ్రతుకే సో బెటరు అంటూ సాయితేజ్ చేసిన సినిమా డిసెంబర్ లో థియేటర్లలోకి వస్తుందని అధికారిక ప్రకటన విడుదలైంది. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకోలేదు. ఈ కారణంగా చిరంజీవి సాయితేజ్ ధైర్యాన్ని మెచ్చుకోకపోగా.. మేనల్లుడికి క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. థియేటర్లు పూర్తిగా తెరుచుకోకముందు ఎందుకు రిస్క్ చేస్తున్నావని ప్రశ్నించారట. వచ్చే ఏడాది వరకు ఆగాలని, అవకాశం ఉంటే సినిమా విడుదల వాయిదా వేసుకోవాలని సూచించారట.