నిహారికా, చైతన్యల వివాహానికి ఏర్పట్లన్నీ దాదాపుగా కంప్లీట్ కఅయ్యాయని తెలుస్తోంది. కరోనాను ధృష్టిలో ఉంచుకుని అతి తక్కువ బంధువులకు, అథితులకు ఆహ్వానం పంపుతున్నట్టు సమాచారం.  అయితే ఈ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపిస్తున్నట్టు తెలుస్తోంది.కాగా మెగా ఫ్యామిలీ మెంబర్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే నిహారికా, చైతన్యల ఎంగేజ్ మెంట్ కు కూడా పవన్ కళ్యాణ్ రాలేకపోయారు. కాగా పెళ్లికి కూడా హాజరవుతారో లేదోనని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే వకీల్ సాబ్ మూవీ షూటింగ్ లో ఈయన బిజీగా ఉన్నారు కాబట్టి ఇలా అనుకుంటున్నారు. అయితే ఈ విషయం పుకార్లు షికార్లు కొడుతున్నాయి.అయితే అల్లరి పిల్ల నిహారికా మాత్రం పెద్దనాన్న, చిన్ననాన్న అయిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ దగ్గర హామీ తీసుకుందట.. నా పెళ్లికి ఖచ్చితంగా రావాల్సిందేనని మాట తీసుకుని ప్రత్యేకంగా వారిని ఇన్వైట్ చేసేసిందట.  ఇంకేముంది వారిరువురూ నిహారికా బ్యూటీ పెళ్లికి తప్పకుండా హాజరవుతారని వార్తలు వినిపిస్తున్నాయి.