అగ్ర హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా విహారయాత్రలో భాగంగా తన ఫ్యామిలీతో దుబాయ్‌కు వెళ్లి వారం రోజులు అక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చారు. బుధవారం రాత్రి ఎన్టీఆర్ హైదరాబాద్‌లో అడుగుపెట్టగా, ఎయిర్ పోర్ట్‌లో తన కొడుకు అభయ్ రామ్ చేయి పట్టుకొని నడుస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కళ్ళజోడు, ముఖానికి మాస్క్,గుబురు గడ్డంతో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు ఎన్టీఆర్.ఇక ఫ్యామిలీతో వారం రోజుల పాటు ఎంజాయ్ చేసిన తారక్.. ఈ వారంలోనే ఆర్ఆర్ఆర్ టీంతో షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. తారక్ లేని వారం రోజులు మన జక్కన్న.. మిగతా నటీ,నటులపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాడు. ఇప్పుడు తారక్ మళ్ళీ షూటింగ్ కు రాబోతున్నాడు. దీంతో రాజమౌళి ఎన్టీఆర్ తో కొత్త షెడ్యూల్ ని ఈ నెల 22 నుండి మొదలు పెట్టనున్నాడని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.