అఖిల్, అభి ఆర్గ్యూమెంట్ లో ఎప్పుడూ కూడా మోనాల్ హస్తం బలంగా ఉంటుందని నెటిజన్స్ అభిప్రాయపడ్డారు.అసలు మొదట్లో వీరిద్దరూ మంచి స్నేహితుల్లా ఉండేవారు మోనాల్ వలన ఇద్దరికీ రాను రాను దూరం పెరిగిందని సోషల్ మీడియా లో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున దూమారం రేపారు. ఇద్దరూ హాయ్ హాయ్ అని చెప్పుకున్నా, అఖిల్ బర్త్ డేకి అభిజిత్ విష్ చేసినా కూడా అది నామమాత్రంగానే ఉండిపోయింది. అంతేకాదు, అభిజిత్ టాస్క్ గెలిచినా కూడా అఖిల్ సోసోగానే కంగ్రాట్స్ చెప్పాడు తప్ప, మనస్పూర్తిగా అయితే ఇద్దరూ కలవలేదు. అయితే, ఇప్పుడు అఖిల్ మదర్, అభిజిత్ మదర్ వచ్చి వాళ్ల ఆప్యాయానురాగాలతో వీరిలో స్నేహపుజల్లులు కురిపించారు. ముఖ్యంగా అఖిల్ మదర్ అభి, మీ బ్రదర్ ని బాగా చూస్కో అంటూ చెప్పిన వైనం అలాగే అభి వాళ్ళ మదర్ అఖిల్ బర్త్ డే విషెస్ చెప్పి పలకరించిన విధానం అయితే ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంటుంది. అలాగే, అభిజిత్ మదర్ గేమ్ లో జరిగినవి గేమ్ లోనే మర్చిపోండి అంటూ సలహా ఇచ్చారు.