సీనియర్ హీరో నటసింహం బాలకృష్ణకి కోపం చాలా ఎక్కువ అని అంటుంటారు.కాని ఆయన చాలా మంచివాడు. అది అర్ధం చేసుకోలేని కొందరు మీమర్స్ ఆయన ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే చాలు అంతా ఆయన్ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటారు.దాన్ని పట్టుకుని ఇక మీమ్స్ తో నెగటివిటీ ని స్ప్రెడ్ చేస్తారు.సోషల్ మీడియాలో లెక్కలేనన్ని మీమ్స్ చేస్తుంటారు. ఇక కొంత మంది అయితే బాలయ్యను ఎగతాళి కూడా చేస్తారు. తాజాగా ఇలాంటి ఎగతాళి కార్యక్రమం ఒకటి సోషల్ మీడియాలో జరిగింది. మూడు రోజుల క్రితం హైదరాబాద్లో జరిగిన ‘సెహరి’ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హీరో హర్ష్ కనుమిల్లి ఫస్ట్ లుక్ను ఆవిష్కరించారు. అయితే, ఈ కార్యక్రమం జరిగిన కొన్ని గంటల్లోనే బాలకృష్ణ మ్యానరిజంపై సోషల్ మీడియాలో వెటకారం మొదలైపోయింది.