ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో 'సైరా నరసింహారెడ్డి', సూపర్ స్టార్ రజినీకాంత్ తో 'దర్బార్' వంటి తదితర చిత్రాల్లో నటించింది.ఈ నేపధ్యంలో ఆమెను తెలుగు సీనియర్ హీరోల సరసన నటించమంటూ దర్శక,నిర్మాతలు అడుగుతూనే ఉన్నారు. రీసెంట్ గా కూడా ఓ సీనియర్ హీరో కోసం ఆమెను అడిగినట్లు సమాచారం. అయితే ఆమె ఎంత రెమ్యునేషన్ ఇచ్చినా కూడా చేయటం కష్టమని తెగేసి చెప్పిందిట. అందుకు ఆమె డేట్స్ ఖాళీ లేవనే కారణం మాత్రమే చెప్పిందిట. అంతకు ముందు కూడా ఆ హీరోతో ఆమె సినిమా చేసిందిట. ఈ నేపధ్యంలో ఎవరా సీనియర్ హీరో అనేది ఇప్పుడు అంతటా చర్చనీయాశంగా మారింది.