పవన్ కళ్యాణ్ అందరికన్నా వెనకాలే వకీల్ సాబ్ షూటింగ్ మొదలు పెట్టాడు.మరి మామూలుగానే పవన్ ఎప్పడు షూటింగ్ కి వస్తాడో, ఎప్పుడు రాజకీయాలంటాడో అర్ధం కాదు.ఇక దగ్గర్లోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. పవన్ ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇటు మరోవైపు పవన్ కళ్యాణ్ అన్న కూతురు.. నిహారిక పెళ్లికూడా ఈ డిసెంబర్ నెలలో జరుగనుంది. పవన్.. నిహారిక పెళ్లికి కచ్చితంగా వస్తానని మాటిచ్చాడట. దీనితో ఇప్పుడు దిల్ రాజు పరిస్థితి అయోమయంగా మారింది.ముందు నుంచే దిల్ రాజు.. వకీల్ సాబ్ సినిమాని వచ్చే సంక్రాంతి కి విడుదల చేస్తామంటూ చెప్పుకుంటూ వస్తున్నాడు.  కాన్ని సడన్ గా పవన్ కళ్యాణ్ ఇలా ప్లేటు పిరాయించడంతో.. ఇప్పుడు వకీల్ సాబ్ రిలీజ్ దిల్ రాజుకు పెద్ద తంటాలనే తెచ్చిపెట్టింది. అందుకే దిల్ రాజు ఇప్పుడు ఈ సినిమా విడుదల విషయంలో ఓ సరైన నిర్ణయం తీసుకులేకపోతున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి.ముందు నిహారిక పెళ్ళి.. ఆ తర్వాత ఎన్నికల హడావిడి అయిపోయాక పవన్ సినిమా విడుదల విషయంలో ఓ నిర్ణయానికి వస్తే బాగుంటుందని దిల్ రాజు అనుకుంటున్నాడట