గందపు చెక్కలతో పట్టుబడిన స్మగ్లర్‌గా బన్నీకి సంబంధించి ఫస్ట్ లుక్‌ను, ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసింది పుష్ప చిత్ర యూనిట్. ఇక ఈ ఫస్ట్‌లుక్ మాస్ మసాల ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఉండడంతో, ఈ చిత్రం పై అంచనాలు భారీగా పెరిగాయి.చింపిరి జుట్టు, మాసిన గడ్డం, అక్కడక్కడ చిరిగిన ప్యాంటు, కరెక్ట్‌గా చెప్పాలంటే, మట్టి మనిషిగా మారిపోయాడు అల్లు అర్జున్. ఈ పిక్ చూస్తుంటే ఓ పాత్రకి తనవంతుగా న్యాయం చేసేందుకు బన్ని ఎంత కష్టపడతాడో అర్ధమవుతోంది.ఊర మాస్ లుక్ లో ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్నాడు.