ఉన్నట్టుండి అజయ్ దేవగణ్ నేరుగా హైదరాబాద్ లో దిగిపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆయన ఇంతకుముందు ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణలో పాల్గొన్నారు. ఇప్పుడు దేనికోసం వచ్చారు? అన్న చర్చా వేడెక్కిస్తోంది.రాజమౌలి ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ కోసమే విచ్చేశారా?అజయ్ ఈ ఏడాది ప్రారంభంలో ఆర్.ఆర్.ఆర్ లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను పూర్తి చేశారు. హైదరాబాద్ కు తిరిగి రావడానికి కారణం... రాబోయే షెడ్యూల్లో తన మొత్తం భాగాన్ని పూర్తి చేయడానికి తిరిగి వచ్చాడని ఊహాగానాలకు ఇది దారితీసింది.