ఇక టాలీవుడ్లో హీరోగా లాంచ్ అవ్వడానికే..సమంత, తమన్నా, కాజల్ వంటి హీరోయిన్లను రంగంలోకి దింపైన బెల్లం బాబు. అలాంటిది బాలీవుడ్ ఎంట్రీకి ఊరుకుంటాడా? చిన్న హీరోయిన్లను ఎంపిక చేసుకుంటాడా? అందుకే ఏకంగా సారా అలీ ఖాన్, అనన్య పాండే వంటి బాలీవుడ్ క్రేజీ బ్యూటీస్ ను రంగంలోకి దింపుతున్నారని సమాచారం. ఈ చిత్రం కోసం ఏకంగా రూ.80 కోట్ల నుండీ రూ.100 కోట్ల వరకూ బడ్జెట్ పెట్టాలని అనుకుంటున్నారట బాలీవుడ్ నిర్మాతలు..