రాజమౌళి సీరియల్స్ చేస్తున్నప్పటి నుంచే రాజీవ్ కనకాలతో పరిచయం ఉందట.. ఇద్దరూ సాయంత్రం స్టోరీ చర్చలు చేసుకునే వారట.. ఆ తర్వాత రాజమౌళి దర్శకుడు అయ్యాక స్టూడెంట్ నంబర్ 1 చిత్రం టైంలోనే బాహుబలి కథను తనకు చెప్పాడని.. కొన్ని ఫైట్ సీక్వెన్సులు, హీరో ఎలివేషన్ గురించి కొన్ని అప్పుడే రాజమౌళి రాసి పెట్టుకున్నాడని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చాడు. అప్పుడు తనకు చెప్పినట్టే బాహుబలిలో చూపించాడని.. రాజమౌళి ఒక గొప్ప విజినరీ అని పేర్కొన్నాడు.  20 ఏళ్ల కిందటే రాజమౌళి బాహుబలి కథను రెడీ చేశాడని.. దాన్ని ఇన్నాళ్లకు తెరపైకి అద్భుతంగా చూపించి...తన కల నెరవేర్చుకున్నాడంటూ చెప్పుకొచ్చాడు రాజీవ్ కనకాల.