. 'సర్కారువారిపాట'లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్, జేజెమ్మ అనుష్క శెట్టి నటించనుందనే వార్త ఇప్పుడు ఇండ్రస్టీ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది..  ఇందులో నిజమెంతముందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు మహేశ్ 'సర్కారువారిపాట' చిత్రంలో అనుష్క శెట్టి ఓ బ్యాంక్ ఆఫీసర్ రోల్లో కనిపించనుందంటున్నారు. ఇంతకు ముందు మహేశ్, అనుష్క జోడీ 'ఖలేజా' సినిమాలో జత కట్టారు. ఆ సినిమా అంతగా ఆడలేదు.కానీ ఆ సినిమాలో వీరిద్దరి జోడిని తెరపై చూసి ప్రేక్షకులు భాగా ఎంజాయ్ చేసారు.ఆ తర్వాత వీరి జోడీ తెరపై కనిపించనేలేదు.కానీ ఇప్పుడు వీరిద్దరూ కలిసి తెరపై కనిపించబోతున్నారనే వార్తతో.. అటు సాధారణ ప్రేక్షకులతో పాటు ఇటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో కూడా ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసాయనే చెప్పాలి