ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నతేజస్వి  తన రిలేషన్షిప్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.తన గురించి బోల్డ్‌గా చెప్పుకొచ్చింది.తన కెరీర్లో తొలిసారి లిప్‌లాక్ సీన్లలో నటించానని, గతంలో నటించిన ముద్దు సన్నివేశాలన్నీ ఫేక్ అని చెప్పుకొచ్చింది తేజస్వి. సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో పెళ్లి చేసుకుని సెటిల్ కావాలని అనుకున్నానని, అయితే ఆ పెళ్లి క్యాన్సిల్ అయిందని చెప్పింది. మళ్లీ అవకాశాలు రావడంతో పెళ్లి సంగతి పక్కన పెట్టేశానని, ఇక జీవితంలో పెళ్లి జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.పెళ్లి చేసుకోకపోయినా బాయ్‌ఫ్రెండ్‌తో ఉంటే తప్పులేదని, ప్రస్తుతం తానొక వ్యక్తిలో రిలేషన్లో ఉన్నానని తేజస్వి తెలిపింది. గతంలో తాను ఇద్దరితో డేటింగ్ చేశానని, పదేళ్ల పాటు వ్యవహారం నడిచిందని చెప్పుకొచ్చింది ఈ హాట్ బ్యూటీ.