షకలక శంకర్, సుడిగాలి సుధీర్, ధనరాజ్ ల తరువాత హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు గెటప్ శ్రీను.జబర్దస్త్ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. తన టైమింగ్ తో జనాలను కడుపుబ్బా నవ్వించగలిగే సత్తా వున్న నటుడు. పలు సినిమాలలో కూడా కామెడీ క్యారెక్టర్లలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు గెటప్ శీను. ఇప్పుడు సరాసరి హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. "రాజు యాదవ్ " అనే చిత్రంతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచబోతున్నాడు గెటప్ శీను.