గ్రేటర్ ఎన్నికల్లో జనసేన బరిలోనుంచి తప్పుకున్నా.. బీజేపీ తరపున ప్రచారం చేయాల్సిన బాధ్యత పవన్ పై ఉంది. ఇప్పటికే పవన్ ని టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇస్తున్న సందర్భంలో ఆయన సైలెంట్ గా ఉండటం కుదరదు. అందుకే పవన్ కూడా పాలిటిక్స్ తో బిజీగా మారబోతున్నారు. దీంతో వకీల్ సాబ్ అనుకోకుండా డిసెంబర్ కి వాయిదా పడింది. దీంతో హీరోయిన్ శృతిహాసన్ తాజాగా ఇచ్చిన డేట్స్ క్యాన్సిల్ చేసి, డిసెంబర్లో కాల్షీట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఇలా పవన్ రాజకీయాలతో శృతి హాసన్ ఇబ్బంది పడుతోంది.