ప్రభుదేవా రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఆయన పెళ్లి గురించి కొన్నిరోజులుగా వస్తున్న వార్తల్నితమ్ముడు రాజు సుందరం కన్ఫామ్ చేయడంతో ప్రభు పెళ్లి వ్యవహారం బైటపడింది. అయితే ఈ వ్యవహారం అంత సీక్రెట్ గా జరగడానికి కారణం మాత్రం ప్రభుదేవా భార్యేనని చెబుతున్నారు. అప్పటికే ప్రభుదేవాకి పెళ్లి కావడం, ఆ తర్వాత నయనతార లవ్ ఎఫైర్ పెళ్లి వరకు వచ్చి క్యాన్సిల్ కావడంతో.. ఇప్పుడు నూతన వివాహ బంధం విషయంలో ప్రభు భార్య కండిషన్ పెట్టిందట. అందుకే ఆయన రెండో పెళ్లి తంతుని అత్యంత రహస్యంగా కానిచ్చేశారు.