సాహో తర్వాత దర్శకుడు సుజీత్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఇటీవలే వివాహం చేసుకున్న ఈ యువ దర్శకుడు లూసిఫర్ రీమేక్ చేస్తారని వార్తలొచ్చాయి. ప్రభాస్ మూవీ తర్వాత ఏకంగా చిరంజీవి సినిమా అంటే.. సుజీత్ కి మంచి ఆఫరే దొరికిందని అనుకున్నారంతా. కానీ అది మిస్ అయిపోయింది. ఇటీవల “ఛత్రపతి” హిందీ రీమేక్ చేయాల్సిందిగా నిర్మాతలు సుజీత్ ని సంపద్రించింది కూడా నిజమే. ఐతే అది కూడా ఈయన చేయట్లేదు. ప్రస్తుతం తాను ఏ రీమేక్ సినిమా చేయట్లేదని సుజీత్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఊహాగానాలకు తెరదించారు.