మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అయ్యప్పుమ్ కొషియన్ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమా తెలుగులో చేయాలని..చేస్తే బాగుంటుందని పవన్ కల్యాణ్ కు సూచనలు చేసింది త్రివిక్రమ్ శ్రీనివాసే. దాంతో సినిమా బాధ్యతలు కూడా ఈయన తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. కుర్ర దర్శకుడు కావడంతో అతనికి త్రివిక్రమ్ సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. చెప్పాలంటే ఈ రీమేక్ కు సాగర్ కే చంద్ర దర్శకుడు అయితే దర్శకత్వ పర్యవేక్షణ త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్న మాట. అంతే కాదు కథ విషయంలో కూడా ఆయన తగిన మార్పులు చేస్తున్నాడు. డైలాగ్ వెర్షన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. స్క్రీన్ ప్లే లో కీలకమైన మార్పులు చేసి పవన్ కల్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా తెలుగులో ఈ కథకు తుదిమెరుగులు దిద్దుతున్నాడు త్రివిక్రమ్. దర్శకుడిగా కావాల్సినంత ఇమేజ్ ఉండికూడా స్నేహితుడి కోసం ఒక మెట్టు దిగుతున్నాడు మాటల మాంత్రికుడు. మిగిలిన ఎవరు అడిగినా కూడా ఆయన కథ, మాటలు రాయడు. కానీ పవన్ కళ్యాణ్ కోసం తన నియమాలు తీసి పక్కన పెట్టాడు త్రివిక్రమ్.