ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ...‘‘నవ వసంతం’ సినిమా చేస్తున్న సమయంలో తరుణ్, నేను ప్రేమలో ఉన్నామని, పెళ్లి చేసుకోబోతున్నామని వార్తలొచ్చాయట. ఈ విషయం తెలుసుకున్న తరుణ్ అమ్మ రోజా రమణి గారు షూటింగ్ స్పాట్‌కి వచ్చి నన్ను కలిశారు. ‘మీరిద్దరు నిజంగానే ప్రేమించుకుంటున్నారా?.. అదే నిజమైతే మీ పెళ్లి చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. ఏదైనా ఉంటే సంకోచించకుండా చెప్పేయండి’... అని అన్నారు. ఆమె చెప్పేంతవరకు మా గురించి ఆ విధంగా ప్రచారం జరుగుతోందని నాకు తెలీదు. ఒకే హీరోతో వరుసగా రెండు మూడు సినిమాలు చేస్తేనే ఇలాంటి ప్రచారం జరుగుతుంది. కానీ మేమిద్దరం కలిసి ఒక్క సినిమాలోనే నటించాం. అయినప్పటికీ మా గురించి పుకార్లు రేపారు’ అని ప్రియమణి చెప్పారు.