RRR సినిమాలో విలన్స్ గా నటిస్తున్న హాలీవుడ్ నటులు అలిసన్ డుడి, రే స్టీవెన్ సన్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. వారిద్దరికీ సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. RRR సెట్ లో వీరిద్దరూ జాయిన్ అయినట్లు స్వయంగా ప్రకటించింది చిత్ర యూనిట్.ఈ సినిమాలోఎన్టీఆర్ కి జోడిగా మరో హాలీవుడ్ నటి అయిన ఒలివియా మోరీస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఆమె ఈ సినిమా షూటింగ్ లో ఇంకా జాయిన్ కాలేదు. ఐతే ఈమె RRR షూటింగ్ లో ఇంకెప్పుడు పాల్గొంటుందని టాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఐతే ప్రస్తుతం ఫిలిం నగర్ నుంచి అందుతున్నసమాచారం ప్రకారం ముందుగా RRR విలన్స్ పార్ట్ షూటింగ్ అయిపోయాక.. ఆ తర్వాత ఎన్టీఆర్, ఒలివియా ల కాంబినేషన్ సీన్స్ ని షూట్ చేయబోతున్నాడాట జక్కన్న.