తన పెళ్ళికి ఎలాగైనా పవన్ వచ్చేలా నిహారిక మరియు నాగబాబు జాగ్రత్తలు తీసుకున్నారట.ముఖ్యంగా ఈ విషయంలో నిహారికనే స్వయంగా బాబాయ్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి.. ఎట్టి పరిస్థితుల్లోనూ తన పెళ్లికి రావాలని ఈ విషయంలో పవన్ కళ్యాణ్ దగ్గర మాట తీసుకుందట. దీనికి పవన్ కళ్యాణ్ పెళ్ళికి ఖచ్చితంగా వస్తానని నిహారిక కు చెప్పారట.అందుకు పవన్ తన వకీల్ సాబ్ సినిమా షూటింగ్‌ని సైతం పక్కన పెట్టి నిహారిక పెళ్లికి హాజరు కానున్నాడు. అంతేకాదు పెళ్లికి రెండు రోజుల ముందే చేరుకొని, పెళ్లి పనులు చూసుకుంటాను అన్నారట.ఇక నిహారిక పెళ్లిని గ్రాండ్ గా సెట్ చేశారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ నందు గల ఉదయ్ పూర్ ప్యాలస్ నందు నిహారిక-చైతన్య వివాహం జరగనుంది.